వరుణ్ తేజ్ విలనీజం.. అదిరింది !
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్ ఇది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సెప్టెంబరు 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘నా సినిమాలో నా విలనే.. నా హీరో’ అంటూ అధర్వ చెప్పి డైలాగ్‌తో టీజర్ ప్రారంభంమైంది. వరుణ్‌తేజ్ మాస్ గెటప్, ఆయన పలికించిన హావభావాలు అదిరిపోయాయ్. భయంకరమైన విలన్ గా కనిపించాడు. చివర్లో ‘అందుకే పెద్దోళ్లు చెప్పిర్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే, రెండు కాల్చుకోవాలి.. రెండు దాచుకోవాలి’ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇకపై వరుణ్ తేజ్ హీరో, విలన్ గానూ కొనసాగవచ్చు.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.