యాదాద్రి పనులు.. మరో 5యేళ్లు కావాలా ?
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సీఎం యాదాద్రి పర్యటనకి వెళ్లారు. ఆలయ పనుల పురోగతిపై, జరగుతున్నతీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. పనులు పూర్తి చేసేందుకు మరో ఐదేళ్లు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని సీఎం చెప్పారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.