సాహో : ‘బ్యాడ్ బోయ్.. ‘ సాంగ్ విన్నారా.. ?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. శ్రద్దా కపూర్ కథానాయి. సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ తో ‘సాహో’ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ట్రైలర్ తో సాహో రేంజ్ ఏంటన్నది తేలిపోయింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సరైన కథని ఎంచుకొన్నాడని చెప్పుకొంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘బ్యాడ్ బోయ్.. ‘ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడేజ్ తో ప్రభాస్ స్టెప్పులేశాడు. సాంగ్ చాలా రొమాంటిక్ గా ఉంది. చాలా స్పెషల్ గా ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేలా ఉంది. ఆ సాంగ్ ని మీరు చూసేయండీ.. !