వైరల్ : ప్రభాస్-రాజమౌళి.. ఓ సరదా సన్నివేశం !


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు జక్కన్న. ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఇక, బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో భారీ బడ్జెట్ సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కూడా ఇదే.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ వేడుకకి రాజమౌళి హాజరయ్యారు. ప్రభాస్-రాజమౌళి కలిసే ఫంక్షన్ కి విచ్చేశారు. కలిసే కూర్చున్నారు. ఈ సందర్భంగా సాహో సినిమాలోని ‘బ్యాడ్ బోయ్.. ‘ సాంగ్ ని రిలీజ్ చేసిన సమయంలో ప్రభాస్ ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారు. సాంగ్ వస్తున్న సమయంలో రాజమౌళితో ఏదో ఆసక్తిగా చెబుతూ కనిపించారు. సాంగ్ పూర్తవ్వగానే రాజమౌళి, ప్రభాస్, అల్లు అరవింద్ నవ్వుల్లో మునిగిపోయారు. ప్రభాస్ అయితే.. అరె.. సాధించేశా అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేశారు. బహుశా.. సాంగ్ షూటింగ్ సమయంలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కెమిస్ట్రీ గుర్తొచ్చినట్టుంది.

ఇక బ్యాడ్ బోయ్ సాంగ్ లో ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులేశాడు. మెగాస్టార్ చిరంజీవి స్టయిల్ లో ప్రభాస్ చేసిన ఓ మూమెంట్ అదిరిపోయింది. బహుశా.. సాంగ్ చూసిన సమయంలో ప్రభాస్ రాజమౌళితో దాని గురించే చర్చించినట్టు అనిపించింది. ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ తో సాహో ప్రమోషన్స్ పీక్స్ చేరాయని చెప్పవచ్చు. ఈ నెల 30సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.