బిగ్ బాస్ 3 : ఈ వారం రోహిణి అవుట్


కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈవారంతో నాలుగు వారాలు విజయవంతంగా పూర్తి చూసుకొంది. ఈ వారం రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగోవారం ఎలిమినేషన్ లిస్టులో మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరిలో రోహిత్ ని తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి తొలివారం హేమ, రెండోవారం జాఫర్, మూడోవారం తమన్నా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక, నాల్గోవారం రోహిణి ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరిగింది. ఊహించినట్టుగానే రోహిణి హౌస్ నుంచి బయటికొచ్చింది. ఇక, నాల్గోవారం ఇంటి సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన ఓ డైలాగ్ ని ఓ సభ్యుడు మరో సభ్యుడిని ఉద్దేశించి చెప్పడం.. దానికి గల రిజీన్ చెప్పారు. అది వినోదాన్ని పంచింది.