సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ : రాజమౌళి స్పీచ్


డార్లింగ్ ప్రభాస్ కు దూరదృష్టి ఎక్కువ అన్నారు దర్శకధీరుడు రాజమౌళి. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాహో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుక రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రభాస్ అందరి హీరో. అందరి హీరోల అభిమానులు ప్రభాస్ ని ఇష్టపడతారు. ప్రభాస్ కి దూరదృష్టి ఎక్కువ. ఎందుకంటే ? ‘బాహుబలి’ చేసే సమయంలోనే తర్వాత సినిమా ఏం చేయాలి. ఎలాంటి సినిమా చేయాలి? బాహుబలి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. తర్వాత సినిమా కోసం ఎలాంటి కథని ఎంచుకోవాలి ? అని అడిగేవారు. ఒకరోజు వచ్చి సుజీత్ మంచి కథ చెప్పారు. బాగా నచ్చిందని చెప్పారు” అని తెలిపారు.

ఇక దర్శకుడు సుజీత్ గురించి రాజమౌళి గొప్పగా చెప్పాడు. సుజీత్ చాలా చిన్నవాడు. కానీ సినిమా బాగా చేశాడు. టీజర్, ట్రైలర్ తోనే సుజీత్ టాలెంట్ ఏంటో తెలిసింది. సాహో కచ్చితంగా హిట్ అవుతుంది. నిర్మాతలకి డబుల్, ట్రిపుల్ లాభాలొస్తాయ్. ప్రభాస్ ఆలిండియా స్టార్ అయితాడని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఇక, వేడుకలో ప్రభాస్-రాజమౌళి జోడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కొన్ని మూమెంట్స్ ని వీరు తెగ ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.