అరుణ్ జైట్లీ.. ఇక కష్టమే !
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అరోగ్యం మరింత క్షీణించింది. శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధ పడుతున్న జైట్లీని ఈ నెల 9న ఢిలీ ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్స్ పై చికిత్స అందిస్తున్నారు. ఏ క్షణమైనా దుర్వార్త వినవచ్చని వైద్యులు చెప్పినట్టు సమాచారమ్. ఆదివారం సాయంత్రం ఆయనను గుండె, శ్వాస వ్యవస్థలకు తోడ్పాటు అందించే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంవో) వ్యవస్థపై ఉంచారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు స్మృతిఇరానీ, జితేందర్ సింగ్, హర్షవర్ధన్, అశ్వినీకుమార్ చౌబే, రాంవిలాస్ పాసవాన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కల్‌రాజ్‌మిశ్ర, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, భాజపా ఎంపీలు రాజ్యవర్ధన్‌సింగ్ రాఠోడ్, గౌతమ్ గంభీర్, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, సంయుక్త ప్రధాన కార్యదర్శి డా.కృష్ణగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్ తదితరులు ఆదివారం ఎయిమ్స్‌కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.