కవిత ఓటమిపై బాబు మోహన్ కామెడీ కామెంట్

తెలంగాణ తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చింది. వందకుపైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకొన్న గులాభి పార్టీకి 88స్థానాలు దక్కాయి. ఆ తర్వాత చేరికలతో తెరాస బలం 100కు చేరుకొంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస లక్ష్యం నెరవేరినట్టయింది. ఐతే, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తెరాస షాక్ తగిలింది. ‘కారు సారు పదహారు’ స్లోగన్ తో బరిలోకి దిగిన గులాభి పార్టీకి కేవలం 9ఎంపీ స్థానాలు మాత్రమే దక్కాయి. దీనికంటే నిజామాబాద్ లో కవిత ఓటమి పార్టీ అధిష్టానాన్ని భాధించింది.

కవిత ఓటమికి ప్రధాన కారణం నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం 170పైగా రైతులు పోటీ చేయడమేననే విశ్లేషకుల మాట. కానీ, కవిత ఓటమిలో నా పాత్ర కూడా ఉందని తాజాగా ప్రకటించుకొన్నారు బీజేపీ నేత బాబు మోహన్. తెరాసలో సీటు దొరక్కా.. ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వర్కింగ్ ప్రెసిడెంటు జేపీ నడ్డా తెలంగాణ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

ఈ జోష్ లో నిజామాబాద్ లో కవిత ఓటమి వెనక తన పాత్ర ఉందని గర్వంగా ప్రకటించుకొన్నారు బాబు మోహన్. అదెలా ? అన్నది మాత్రం వివరించలేదు. బహుశా.. కవిత ఓటమిపై కామెడీ చేసినట్టు అనిపిస్తోంది. లేదంటే తాను ఫలానే ఎత్తుగడ వేయడం వలన కవిత ఓడిపోయారని చెప్పేవారు. ఏదో బీజేపీ అగ్రనేతల కళ్లలో పడేందుకు బాబు మోహన్ కవిత ఓటమి క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఐతే, దీనిపై కవిత నుంచి బాబుమోహన్ కు కౌంటర్ గట్టిగా పడటం ఖాయం.