మందుబాబులకి సినిమా చూపించారు
రాత్రి 11గంటలకి మందుబాబులకి సినిమా చూపించారు. ఫిలింనగర్ నుంచి షేక్‌పేటకు వెళ్లే దారి.. రాత్రి 11 గంటలు.. ట్రాఫిక్ పోలీసుల వాహనాలు, పోలీసులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అటువైపు వచ్చిన వాహనదారులు హడలిపోయారు. ఐతే, అది రియల్ తనిఖీలు కాదు. రీల్ తనిఖీలు. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన సెట్టింగు వేశారు. ట్రాఫిక్ పోలీసులు, పోలీసు వాహనాలను రోడ్డుపై ఏర్పాటు చేశారు.
వచ్చి వెళ్లే వాహనాలను వారు తనిఖీ చేసే దృశ్యాన్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. మద్యం తాగి అటువైపుగా వచ్చిన వాహనదారులకు ఈ విషయం తెలియకపోవడంతో అసలైన ట్రాఫిక్ పోలీసులనే భావించారు. వారి నుంచి తప్పించుకొనేందుకు కొందరు ప్రయత్నం చేశారు. అసలు విషయం తెలిసి.. నవ్వులు చిందిస్తూ మందుబాబులు పాత్రధారులను దాటుకుంటూ వెళ్లారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ? ఈ సినిమా షూటింగ్ కోసం స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల అనుమతి తీసుకోలేదట.