కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమా టైటిల్ ‘మైదాన్’ !

కోలీవుడ్, టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ కీర్తి మరింత పెరిగిపోయింది. మహానటి కీర్తిని ఏకంగా జాతీయ ఉత్తమనటిని చేసింది. ఇక, బాలీవుడ్ లోనూ కీర్తి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ చిత్రానికి అమిత్ శర్మ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్ బాషల్లో సినిమాని తెరకెక్కించనున్నారు.

ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘మైదాన్ ‘ టైటిల్ ని ఫిక్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించనున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో మైదాన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. కేవలం ఫుట్ బాల్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ ని సింపుల్ గా డిజైన్ చేశారు.