ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన కృష్ణంరాజు.. !
సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచారు. ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ-రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. కృష్ణంరాజు వేడుకకి హాజరయ్యారు. ఎప్పటిలాగే హుషారుగా మాట్లాడారు. రెబల్ డార్లింగ్స్ అంటూ అభిమానులని పలకరించారు. కానీ, చాలా ముఖ్యమని విషయం మాత్రం మరిచిపోయారు. కాదు.. కాదు పట్టించుకోలేదు.
ఫ్యాన్స్ గుర్తుచేసినా.. వినపడనట్టు ప్రసంగాన్ని ముగించేసి వెళ్లారు. ఇంతకీ ఆ మేటరేంటీ ? అంటే ప్రభాస్ పెళ్లి మేటరు. కృష్ణంరాజు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. ప్రభాస్ పెళ్లిపై స్పందిస్తారు. అప్పట్లో బాహుబలి సినిమా అయిపోగానే ప్రభాస్ పెళ్లి అన్నారు. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సార్లు ప్రభాస్ పెళ్లిపై స్పందించారు. చివరకు ప్రభాస్ తీరుతో విసిగిపోయిన సీనియర్ రెబల్ స్టార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. పెళ్లెప్పుడు ? అంటే ప్రభాస్ నుంచి సమాధానం రాదు. సాహో ప్రమోషన్స్ కార్యక్రమాల్లోనూ నేషనల్ మీడియా ప్రభాస్ ను గుచ్చి గుచ్చి అడిగింది. కానీ, అటు నుంచి సమాధానం లేదు.
ఈ నేపథ్యంలో పెళ్లిపై ప్రభాస్ ని నిలదీసే ఏకైక వ్యక్తి కృష్ణంరాజు మాత్రమేనని అభిమానులు ఆశపెట్టుకొన్నారు. సాహో ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ పర్సనల్ లైఫ్ పై కృష్ణంరాజు స్పందిస్తారు. ప్రభాస్ పెళ్లి ముచ్చట చెబుతారని ఆశపడ్డారు. కానీ, కృష్ణంరాజు ప్రభాస్ అభిమానులని తీవ్రంగా నిరాశపరిచారు. ప్రభాస్ ప్రేమ, పెళ్లిపై.. ప్రత్యక్షంగా, పోనీ పరోక్షంగా కూడా స్పందించలేదు.