నెక్ట్స్ టార్గెట్ ‘పీవోకే’ మాత్రమే


ఆపరేషన్ జమ్ము-కశ్మీర్ ని విజయవంతంగా పూర్తి చేసింది మోడీ ప్రభుత్వం. ఆర్టికల్ 370రద్దు. జమ్ముకశ్మీర్ విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పక్కా ప్రణాఌకతో వ్యవహరించింది. అందులో విజయం సాధించింది కూడా. ఇప్పడిప్పుడే జమ్ముకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం నుంచి స్కూల్, కాలేజీలు తెరచుకొన్నాయి. ఐతే, ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల 2జీ స్పీడుతో నెట్ ని అందిస్తున్నారు.

మరోవైపు, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లక్ష్యంగా కేంద్ర మంత్రులు స్వరాన్ని పెంచడం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం హరియాణాలోని కల్కాలో జరిగిన ఒక బహిరంగ సభలో రాజ్ నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి పాకిస్థాన్‌తో చర్చలు అసాధ్యమని, ఒకవేళ ఆ దేశంతో చర్చలు జరపాల్సి వస్తే అవి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పైనే ఉంటాయన్నారు రాజ్ నాథ్. మరోవైపు జమ్మూలో జరిగిన భాజపా నేతల సమావేశంలో మరో మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడారు. ‘370’ రద్దు తర్వాత ఇప్పుడు ప్రజలు తమ జీవితకాలంలోనే పీవోకే భారత్‌లో విలీనం కావాలని ప్రార్థించాలన్నారు. మొత్తంగా.. మోడీ ప్రభుత్వం తదుపరి టార్గెట్ ‘పీవోకే’ మాత్రమేనని స్పష్టం అవుతోంది.