‘సాహో’కు రొమాంటిక్ టచ్ !

‘సాహో’.. ఓ యాక్షన్ థ్రిల్లర్. రూ. 350కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అధికభాగం యాక్షన్ సీన్స్ కోసమే ఖర్చుపెట్టారు. దుబాయ్ లో తీసిన యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలివనుంది. ఈ ఒక్క యాక్షన్ ఏపీసోడ్ కోసమే ఏకంగా రూ. 90కోట్లు ఖర్చు చేశారు. ఇక, సినిమా ప్రమోషన్స్ లోనూ యాక్షన్ ని హైలైట్ చేసింది చిత్రబృందం. ముందుగా ప్రభాస్ యాక్షన్ లుక్ లని రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ శ్రద్దా కూడా యాక్షన్ లోకి దిగిందని ఫోటోలు చూపించారు. ట్రైలర్ లోనూ శ్రద్దా యాక్షన్ సీన్ కనిపించింది.

ఆ తర్వాత విలన్స్ యాక్షన్ లుక్ లు క్యూ కట్టారు. యాక్షన్ మూడులోనే ఒకొక్కరికి ఒక్కో కొటేషన్ కూడా ఇచ్చారు. దీంతో సాహో పట్ల రొమాంటిక్ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆ విషయాన్ని అర్థం చేసుకొన్న చిత్రబృందం సాహో రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ముందుగా ప్రభాస్-శ్రద్దా కపూర్ ల రొమాంటిక్ స్టిల్స్ కొన్ని రిలీజ్ చేశారు. ఇక సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముందు వదిలిన ఓ రొమాంటిక్ పోస్టర్ అదిరిపోయింది. ‘బ్యాడ్ బోయ్.. ‘ సాంగ్ తో సినిమాలో రొమాన్స్ మిస్ కాలేదు. ఓ రేంజ్ లో ఉందని హింట్ ఇచ్చారు

మొత్తానికి ‘సాహో’కు రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఇక మిగిలింది కామెడీ. త్వరలోనే సాహోకి కామెడీ టచ్ కూడా ఇస్తారేమో చూడాలి. మరీ.. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నవ్వించేది ఎవరు ? ఆ బాధ్యత ప్రభాస్ నే తీసుకొని ఉంటాడు. ఎందుకంటే ? సీరియస్ ఫైట్ జరుగుతున్న సమయంలో వాళ్లంతా ఎవరు ? అని అడిగితే.. కూల్ గా డై హార్ట్ ఫ్యాన్స్ అని కూల్ గా ప్రభాస్ చెప్పిన మాట నవ్వుని తెప్పించాయి. ఇలాంటి సినిమాలో చాలానే ఉన్నాయని అంటున్నారు.