‘సైరా’ వాయిదా పడితే మంచిదేమో.. !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవిని దెబ్బతీసేలా కనిపిస్తున్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఆయన తాజా చిత్రం ‘సాహో’ని కూడా బాహుబలి రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహో కు నెల గ్యాప్ లో ‘సైరా’ (అక్టోబర్ 2) రాబోతుంది. బడ్జెట్, ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో సాహో, సైరాని మించిపోయిందని చెబుతున్నారు. రూ. 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో.. రూ. 300కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇంకా డిజిటల్ రైట్స్ చేతిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కి ముందే సాహో సేఫ్ అయింది. ఇక, రూ. 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ సాహో రేంజ్ లో లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సేఫ్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. పైగా సాహో ఎఫెక్ట్ సైరాపై గట్టిగానే పడేలా కనబడుతోంది. సాహో హిట్టయినా.. ప్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ సైరా పడనుందని చెబుతున్నారు. అదెలా అంటే ? సాహో బ్లాక్ బస్టర్ హిట్టైతే.. నెలకి మించి థియేటర్స్ లో సందడి చేయడం ఖాయం.
అప్పుడు సైరాకు థియేటర్స్ కొరత ఏర్పడుతుంది. ఒకవేళ సాహో ప్లాప్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 100 కోట్ల మేరకు అడ్వాన్స్ ల రూపంలో అందించాల్సి వుంటుంది. ఈ మేరకు ఇప్పటికే అగ్రిమెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇచ్చిన అడ్వాన్స్ లు అన్నీ సెటిల్ కావాలి అంటే కనీసం అయిదారువారాలు పడుతుంది. మరోవైపు సాహోని తీసేసి సైరాని రిలీజ్ చేసిందుకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బులు కట్టాలి అంటే అంత సులువుకాదు. ఈ నేపథ్యంలోనే సాహో ఎఫెక్ట్ సైరాపై కచ్చితంగా ఉండనుంది. అందుకే సైరాని వాయిదా వేసుకోవడం మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.