అందుకే.. అక్కడ కాజల్ ని వాడుకొన్నాం !
స్టార్ హీరోయిన్ కాజల్ పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు శర్వానంద్. ఆయన తాజా చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకుడు. కల్యాణి ప్రియదర్శిణి, కాజల్ కథానాయికలుగా నటించారు. ఐతే, సినిమాలో కాజల్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. అసలు ఆమె పాత్రే అవసరం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై శర్వా క్లారిటీ ఇచ్చారు.
కాజల్ కథ నచ్చి చేసింది. సినిమాలో మాకు కాస్త్ బ్రీతింగ్ స్పేస్ కావాలి. నాది 40 ఏళ్ల ఓల్డర్ గెటప్. ఆ క్యారెక్టర్ పక్కన నటించడానికి తను ఒప్పుకోవడం అనేది మాకు బాగా హెల్ప్ అయింది. ఆ సన్నివేశాల్లో కాజల్ లాంటి గ్లామరస్ హీరోయిన్ ఉంటేనే బాగుంటుందని భావించాం. కాజల్ కు సినిమాలో పెద్దగా స్కోప్ లేదని తన ఫ్యాన్స్ ఫీల్ అవ్వొచ్చు. కానీ ఆమె నటించడానికి ఒప్పుకోవడం గ్రేట్. అందుకే కాజల్ కు థ్యాంక్స్ అన్నారు శర్వా. 40యేళ్ల పాత్రలో శర్వాని భరించడానికి కాజల్ ని వాడుకొన్నారన్న మాట.
ఇక సినిమాలో ‘పిల్లా పిక్చర్ ఫర్ ఫెక్ట్ .. ‘ సాంగ్ లో కాజల్ ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసింది. సీరియస్ గా సాగుతున్న కథలో శర్వా చెప్పినట్టు ప్రేక్షకులని రిలాక్స్ చేసింది. ఐతే, సినిమాలో కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, ఆమె గ్లామర్ కోసమే వాడుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.