హిట్ కిక్కులో రెజీనా రెచ్చిపోయిందిగా.. !

లక్కులేని హీరోయిన్ అనిపించుకొంది రెజీనా. అందం+అభినయం తెలిసినా బిజీ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. ఆమె తర్వాత వచ్చిన యంగ్ హీరోయిన్లు నటన రాకపోయినా.. గ్లామర్ తో హిట్స్ అందుకొన్నారు. స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. రెజీనాకి మాత్రం అదృష్టం కలిసిరాలేదు. మంచి నటి అనిపించుకొంది. కానీ, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రెజీనా గ్లామర్ డోస్ పెంచేసింది. ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చింది.

ఇలాంటి సమయంలో ‘ఎవరు’ రూపంలో రెజీనా ఖాతాలో హిట్ పడింది. కొత్త దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవరు’ చిత్రంలో అడవిశేష్, రెజీనా, నవీన్ చంద్రలు ప్రధాన పాత్రలో నటించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. అంతకుమించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘ఎవరు ‘ సినిమా బాగుందని కితాబిచ్చారు. చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

‘ఎవరు’ హిట్ కిక్కులో ఉన్న రెజీనా ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసింది. క్లీవేజ్ షోతో అదరగొట్టింది. రెజీనా లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్. హిట్ కోసం అందాలు ఆరబోయడం చూశాం. కానీ, రెజీనా మాత్రం హిట్ దక్కినా రిలాక్స్ కావడం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్ తో హీటెక్కించే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని ఆఫర్స్ కోసం రెజీనా ముందస్తు ప్లాన్ ఇది అన్నమాట. మరీ.. .ఆమె కోరిక తీరుతుందేమో చూడాలి.. !