బుమ్రాపై ప్రేమని బయటపెట్టిన అనుపమ !
కన్నడ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టీమిండియా పేసర్ జస్మీత్ బుమ్రాతో ప్రేమలో ఉందనే ప్రచారం జరిగింది. ఎందుకంటే ? ట్విట్టర్ లో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక నటి అనుపమ మాత్రమే. అందుకే వీరి మధ్య ఏదో నడుస్తోంది. చాలా సలైంట్ ప్రేమించుకొంటున్నారేమోననే వార్తలు వినిపించాయి. ఐతే, ఈ ప్రచారాన్ని అనుపమ ఖండించింది. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో బుమ్రాతో ఎఫైర్ పై ప్రశ్నలు ఎదురైతే.. నో కామెంట్ అంటూ దాటవేసింది. తాజాగా అనుపమ స్వయంగా బయటపడింది.
అనుపమ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో లవ్ సింబల్స్ తో ‘i a n j you’ అని మూడు పోస్ట్ లు పెట్టింది. అర్ధమయి.. అర్ధం కాకుండా పోస్ట్ పెట్టి తన తెలివి ప్రదర్శించింది. ఇందులో ‘a’ అంటే అనుపమ అని ‘J’ అంటే జస్ప్రీత్ బుమ్రా అని నెటిజన్స్ కనిపెట్టారు. బుమ్రాపై ఉన్న ప్రేమని అనుపమ ఇలా బయటపెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పరోక్షంగా కాకుండా నేరుగా బుమ్రాతో ప్రేమ విషయాన్ని అనుపమ ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి. ఇక, అనుపమ నటించిన తెలుగు సినిమా రాక్షసుడు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకొంది.