బాలయ్య కొత్త లుక్.. చూశారా ?

నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఆయన 105వ సినిమా కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బ్యాకాంక్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య లుక్ బయటికొచ్చింది. బాలయ్య పూర్తిగా మారిపోయాడు. యంగ్ లుక్ లో స్టయిలీష్ గా కనిపిస్తున్నారు.

గడ్డెలు, మీసాలు తీసేశాడు. Van Dyke Beard Styleలో అదిరిపోయేలా ఉంది బాలయ్య న్యూ లుక్. ఈ చిత్రంలో బాలయ్య రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. బాలయ్యకి జంటగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. వచ్ఛే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.