బిగ్ బాస్3 కిక్కు దొబ్బింది !

బిగ్ బాస్3 సాదాసీదాగా సాగిపోయింది. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి సస్పెన్స్ ఉండటం లేదు. ప్రతివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం ముందే తెలిసిపోతుంది. తొలివారం హేమ ఎలిమినేట్ అయ్యారు. ఆమె ఎలిమినేట్ అయినందుకు ఎలాంటి ఆశ్చర్యం అనిపించలేదు. మిగితావారికంటే ఆమె వయసులో పెద్ద. చాదస్తం ఎక్కువే. అతిగా మాట్లాడి బుర్ర తింటుంది. ఈ నేపథ్యంలో తొలివారమే హేమ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండోవారం జాఫర్ ఎలిమినేట్ కావడం ఊహించినదే.

మూడోవారం తమన్నా ఎలిమినేట్ అయింది. ప్రేక్షకులు, ఇంటి సభ్యులు ఎప్పుడెప్పుడు తమన్నా ఇంటి నుంచి తరిమేయాలా ? అని చూశారు. తరిమేశారు. ఇక నాలుగోవారం రోహిణి అవుట్. ఉన్నవారిలో రోహిణికే కాస్త క్రేజ్ తక్కువ. పైగా వాగుడుకాయ్. అందుకే ఆమె ఎలిమినేట్ అయింది. వచ్చేవారం హిమజ ఎలిమినేట్ కాబోతుందని ముందే తెలిసిపోతుంది. సోమవారం జరిగిన ఎలిమినేట్ ప్రక్రియలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వీరిలో హిమజ, రాహుల్ లని ఎక్కువ మంది నామినేట్ చేశారు. పునర్నవితో రాహుల్ చిలిపి పనులు ప్రేక్షకులని ఆకట్టుకొంటున్నాయ్. ఈ నేపథ్యంలో వచ్చేవారం రాహుల్ సేప్. హిమజ అవుట్ అని ఈజీగా చెప్పేస్తున్నారు.

బిగ్ బాస్ 1లో ఎలిమినేట్ ప్రక్రియ ఉత్కంఠ సాగేది. యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ఊరించి, ఉడికించి ఒక్కరిని ఎలిమినేట్ చేసేవారు. ఇక రెండో సీజన్ లో నాని పర్వాలేదనిపించాడు. తాజా సీజన్ లో మాత్రం ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలాంటి కిక్కులేకుండా పోయింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం హోస్ట్ నాగార్జున గ్రహిస్తే మంచిదేమో.. !