క్యాన్సర్‌ ని ముందే గుర్తించే పరిజ్ఝానం వచ్చేసింది

గుడ్ న్యూస్ క్యాన్సర్ క్యాన్సర్‌ రోగుల్లో ముందస్తు వ్యాధి నిర్థారణ పరిజ్ఝానం వచ్చేసింది. పరిజ్ఝానాన్ని పుణె ‘అంకుర సంస్థ’కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ఆంకోడిస్కవరీ’ పరిజ్ఞానంగా పిలిచే ఈ ప్రక్రియకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ఆమోదం లభించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ పరిజ్ఞానంతో క్యాన్సర్‌ రోగుల్లో ముందస్తు వ్యాధి నిర్ధరణలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని చెబుతున్నారు. గతంలో సర్క్యులేటింగ్‌ ట్యూమర్‌ సెల్స్‌(సీటీసీ)ను గుర్తించే ఓ పరీక్షకు అమెరికా ఆమోదం తెలిపినా.. దాని వ్యయాన్ని భారతీయులు భరించలేరని, ఆంకోడిస్కవరీకి చాలా తక్కువ వ్యయం అవుతుంది. ఇప్పుడీ ఈ పరీక్షని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం గొప్ప విషయం.