అభినందన్‌’ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం

భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు. అహ్మద్‌ ఖాన్‌ పాక్‌ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. చొరబాటుదారులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్‌ సెక్టార్‌లో ఈ నెల 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు.

భారత్‌ – పాక్‌ సరిహద్దులో పాక్‌ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించేందుకు అహ్మద్‌ ఖాన్‌ కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాక్‌ రచించే వ్యూహాలను అతడు అమలు చేసేవాడని సమాచారమ్. అభినందన్‌ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫొటోల్లో అహ్మద్ ఖాన్‌ ఆయన వెనుకే ఉన్నాడు.