రాహుల్ రవీంద్రన్ మరోటి !

‘చిలసౌ’ సినిమాతో దర్శకుడుగా నిరూపించుకొన్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమాకు గానూ జాతీయ అవార్డు అందుకొన్నాడు. ‘చిలసౌ’ సినిమాకు గానూ బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ఐతే, రాహుల్ దర్శకత్వం వహించిన రెండో సినిమా మన్మథుడు 2 ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘మన్మథుడు’ సినిమాతో ‘మన్మథుడు 2’ చిత్రాన్ని పోల్చి చూడటం, సినిమాలో రొమాన్స్ డోస్ మరీ ఎక్కువ అవ్వడం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. ఇటు ఫ్యామిలీ, అటు యూత్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫైనల్ గా మన్మథుడు 2 ప్లాప్ గా తేలిపోయింది.

ఈ నేపథ్యంలో రాహుల్ కి మరో సినిమా ఛాన్స్ రావడం కష్టమే అనుకొన్నారు. కానీ, చాల ఈజీగా రాహుల్ నెక్ట్స్ సినిమా ఓకే అయింది. ‘చిలసౌ’ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. ఈ సినిమా సమయంలోనే రాహుల్ తో మరో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అంతేకాదు.. హీరోగా నాని లేదా నాగా చైతన్యని సెట్ చేయనుంది. వీరిలో ఎవరైనా రాహుల్ కి ఒకే. సుశాంత్ లాంటి ఫేడ్ అవుట్ అయిన హీరోకే రాహుల్ హిట్ ఇచ్చాడు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న చైతూ, నానిలు దొరికితే రాహుల్ అసలు టాలెంట్ ఏంటో చూపించే అవకాశం దొరుకుతుంది.