శ్రీశాంత్‌’పై నిషేధం ఎత్తివేత


టీమిండియా క్రికెటర్‌ శ్రీశాంత్‌కు హ్యాపీడేస్ మొదలయ్యాయి. ఆయనపై నిషేధం ఎత్తేశారు. ఏడేళ్ల వరకే నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, విశ్రాంత న్యాయమూర్తి డీకే జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీశాంత్‌కు 2020 ఆగస్టులో విముక్తి లభించనుంది. దీంతో శ్రీశాంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. కేరళ తరఫున, విదేశీ లీగుల్లో ఆడనున్నాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్ పై 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అతడితో పాటు అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 169 వికెట్లు తీశాడు. 2011లో అతడికి భారత జట్టుకు చివరి మ్యాచ్‌ ఆడాడు.