‘సైరా’ టీజర్.. ఈ మధ్యాహ్నమే !

మెగా అభిమానులకు ఈరోజు చాలా స్పెషల్. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ టీజర్ రాబోతుంది. మధ్యాహ్నం 02:40నిమిషాలకి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఓ పోస్టర్ ని విడుదల చేసింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ తెరకెక్కింది. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటించారు.

ఆగస్టు15 కానుకగా విడుదల చేసిన ‘సైరా’ మేకింగ్ వీడియోకు అద్భుతమైన సందన వచ్చింది. ఇక టీజర్ తో అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయమని చెబుతున్నారు. టీజర్ లో చిరంజీవి పాత్రకు పవన్ కల్యాణ్ వాయిస్ అందించడం విశేషం.