భారత్-పాక్.. క్రెడిట్ కొట్టేసిన అమెరికా!
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో నేపథ్యంలో అమెరికా మధ్యవర్థిత్వం తప్పలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ప్రధానులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘‘నాకు మంచి మిత్రులైన భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడాను. వాణిజ్య, ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా చర్చలు సాగాయి. ఆందోళనకర పరిస్థితుల మధ్య సుహృద్భావ మంతనాలు జరిగాయి’’ అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఆర్టికల్ 370రద్దు, కశ్మీర్ విభజన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఇమ్రాన్ రెచ్చగొట్టే ధోరణిని ట్రంప్ వద్ద ఎండగట్టారు. దీనిపై స్పందించిన ట్రంప్ కొన్ని గంటల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. కశ్మీర్‌పై మితంగా మాట్లాడాలని సూచించారు. ఐతే, ఈ మొత్తం ఏపీసోడ్ లో అమెరికా క్రెడిట్ కొట్టేసింది.
Spoke to my two good friends, Prime Minister Modi of India, and Prime Minister Khan of Pakistan, regarding Trade, Strategic Partnerships and, most importantly, for India and Pakistan to work towards reducing tensions in Kashmir. A tough situation, but good conversations!
— Donald J. Trump (@realDonaldTrump) August 19, 2019