ఇకపై టీమిండియాకు ఇద్దరు కెప్టెన్స్

టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టుని ముందుండి నడిపిస్తున్నారు. ఐతే, వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో టీమిండియా ఓటమి చెందడం అభిమానులకి నచ్చలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా రోహిత్ శర్మ ని నియమించాలనే డిమాండ్ అప్పట్లో వినబడింది. మరోవైపు, టీమిండియాలో కోహ్లీ, రోహిత్ ల మధ్య విబేధాలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం పక్కనపెడితే దక్షిణాఫ్రికా-ఏతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ సంచలన ప్రయోగం చేస్తోంది. భారత్‌-ఏ తరఫున దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ఇద్దరు కెప్టెన్ లతో రెండు జట్లను ప్రకటించింది. తొలి మూడు వన్డేలకు మనీశ్ పాండే, చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ లుగా వ్యవహరిస్తారు. శుభ్‌మన్‌గిల్‌, విజయ్‌ శంకర్‌, అన్‌మోల్‌ ప్రీత్‌, రికీ భుయ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ రాణా ఇద్దరు కెప్టెన్స్ నేతృత్వంలో ఆడతారు. పాండే జట్టుకు ఇషాన్‌ కిషన్‌, అయ్యర్‌ జట్టుకు సంజు శాంసన్‌ కీపర్ గా ఉండనున్నారు.