ట్రెండింగ్ : వైఎస్ జగన్ ఫెల్యూర్ సీఎం


ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్నది ఏపీ సీఎం వైఎస్ జగన్ పెట్టుకొన్న లక్ష్యం. కానీ, మూడు నెలలు తిరక్కముందే ఆయనపై ఫెల్యూర్ సీఎం అనే ముద్రపడిపోయింది. ప్రస్తుతం #YSJaganFailedCM హాష్ ట్యాగ్ ఇండియన్ ట్రెండింగ్ టాప్ లో ఉంది. వరదలని జగన్ ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కోకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఎగువరాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలకి భారీగా వరదనీరు చేరింది. ఆ వరద నీరుతో ఏపీ రాజధాని అమరావతిలోకి నీళ్లు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి ప్రాంగణంలోకి వరదనీరు చేరింది. దీన్ని వైసీపీ రాజకీయం చేయాలని చూసింది. దాన్ని టీడీపీ నేతలు గట్టిగా తిప్పికొట్టారు. చంద్రబాబు భద్రత విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయ్. తాజాగా రాజధాని అమరావతి సురక్షితం కాదంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎటాక్ ప్రారంభించేసింది. #YSJaganFailedCM యాష్ ట్యాగ్ తో వరదలు వచ్చిన సమయంలో అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ తీసుకొన్న చొరవతో సోషల్ మీడియాలో ఫోటోలు, కథనాలతో వైరల్ చేస్తున్నారు. దానికి ఫలితం దక్కింది. #YSJaganFailedCM యాష్ ట్యాగ్ ఇండియన్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. ఆర్నేళ్లల్లో వైఎస్ జగన్ బెస్ట్ సీఎం అనిపించుకోవడం పక్కనపెడితే.. వేస్ట్ సీఎం అనిపించుకొనేలా కనబడుతోంది. ఇప్పటికైనా జగన్ జాగ్రత్తపడితే మంచిదేమో..!