కంగ్రాట్స్ కొత్త కెప్టెన్


బిగ్ బాస్ 3 విజయవంతంగా నాలుగువారాలని పూర్తి చేసుకొంది. ఐదోవారంలోకి అడుగుపెట్టింది. ఐదోవారం కెప్టెన్ గా శివజ్యోతి ఎంపికైంది. మంగళవారం ఏపీసోడ్ లో జరిగిన కెప్టెన్ టాస్క్ లో శివజ్యోతి పట్టుదలతో ఆడి గెలిచింది. వితికా, శివజ్యోతి కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన్నారు. క్రేన్‌ సాయంతో ఇద్దర్నీ స్విమ్మింగ్ ఫూల్ పై నుండి గాల్లోకి లేపి.. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వాట‌ర్ ట‌చ్ కాకుండా తోటి స‌భ్యులు వారిని అలానే గాలిలో ఉండేలా తాడు ప‌ట్టుకోవాలి. ఎవ‌రు ఎక్కువ సేపు గాలిలో ఉంటారో వారే విజేత‌లు అని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్ లో శివజ్యోతి విజయం సాధించి.. ఈ వారం కెప్టెన్ అయింది. ఐతే, శివజ్యోతికి ఇప్పుడు కెప్టెన్సీ అవసరం లేదు. ఆమె మరో రెండు మూడువారాల వరకు సేఫ్. ఆమెకి తగిన ఓట్లు పడుతున్నాయి. గేమ్ రాను రాను టైట్ కానుంది. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు వారాల తర్వాత శివజ్యోతి కెప్టెన్ అయితే.. ఓ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకొనేది.

ఇక, ఐదోవారం ఎలిమినేషన్ లిస్టులో ఏడుగురు స‌భ్యులున్నారు. బాబా భాస్క‌ర్, పునర్నవి, మహేష్, హిమజ, అషు, మహేష్, రాహుల్‌ ఎలిమినేషన్ కి ఎంపికయ్యారు. వీరిలో హిమజా, రాహుల్ లని ఎక్కువమంది ఎలిమినేషన్ కి ఎంపిక చేశారు. అంతేకాదు.. ఈ ఇద్దరిలోనే ఒకరు ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా.. హిమజా ఈవారం ఎలిమినేట్ కావొచ్చు.