దబాంగ్ 3 రిలీజ్ డేటు ప్రకటించిన సల్మాన్

దబాంగ్ సిరీస్ లో ఒకటి హిట్టు. మరోటి ఫట్టు. ఇప్పుడీ సిరీస్ లో మూడో చిత్రంగా దబాంగ్ 3 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ కమెడియన్ అలీ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేటు ఫిక్స్ చేసుకొంది.

దబాంగ్ 2 డిసెంబర్ 21న విడుదలైంది. అంతకంతే ఒక్కరోజు ముందుగా అంటే.. డిసెంబర్ 20 దబాంగ్ 3 విడుదల చేయనున్నారు.
సినిమా రిలీజ్ డేటుని సల్మాన్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు ప్రభుదేవా కలిసి దిగిన ఓ స్టిల్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. డింబర్ 20న దబాంగ్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.

ఇక ఈ చిత్రానికి బ్రహ్మాస్త పోటీగా రానుంది. బ్రహ్మాస్త్ర సినిమా కూడా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతున్నది. ఈ రెండు కూడా భారీ సినిమాలే కావడంతో.. క్రిస్మస్ కి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండనుంది.