చిదంబరంకు మరో షాక్
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరాన్ని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎన్ఎక్స్ కేసులో ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారం మంగళవారం చిదంబరం ఇంటికి వెళ్లారు. కానీ, ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు.
ప్రస్తుతం చిదంబరం అజ్ఝాతంలో ఉన్నారు. ఐతే, ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారు. 2007లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని ఆరోపణలున్నాయి.