మాజీ సీఎం బాబులాల్‌ కన్నుమూత

మధ్య ప్రదేష్ భాజాపాలో విషాదం నెలకొంది. మధ్యప్రదేష్ మాజీ సీఎం, భాజాపా సీనియర్ నాయకుడు బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సడెన్ గా గుండెపోటు రావడంతో.. ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. బాబులాల్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌లో 1930, జూన్‌ 2న బాబులాల్‌ జన్మించారు. ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాబులాల్‌.. బాబులాల్‌ గోవింద్‌పురా నుంచి విధానసభకు10 సార్లు ఎన్నికయ్యారు. 2004 -2005 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు.