పవన్ ఇంటిపై పడ్డ మహేష్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాన గణం ఎక్కువే. ఆయన్ని దేవుడిలా ఆరాధించే అభిమానులున్నారు. అదే సమయంలో పవన్ కు శతృవర్గం కూడా ఉంది. ఈ లిస్టులో పెద్దగా వినిపించే పేరు మహేష్ కత్తి. సినీ, రాజకీయ విశ్లేషకుడైన మహేష్ సమయం దొరికినప్పుడల్లా పవన్ పై సంచలన ఆరోపణలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటాడు. తద్వారా పబ్లిసిటీ సంపాదించుకోవడమా.. ? లేక వృత్తి ధర్మమా.. ?? మరోటా అనేది తెలీదు. కానీ పవన్ ని గట్టిగానే తగులుకొంటాడు.

గతంలో పవన్ పర్సనల్ లైఫ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ పూనమ్ కౌర్ తో పవన్ కు లింకుపెట్టి మాట్లాడాడు. పవన్ పర్సనల్ లైఫ్ గురించి మహేష్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మహేష్ ని టార్గెట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ వార్ నడుస్తూనే ఉంది. ఇక, కొన్నాళ్లుగా పవన్ విషయంలో సలైంట్ గా ఉన్న మహెష్ కత్తి.. మరోసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పవన్ ఇంటిపై పడ్డాడు.

పవన్ కు కావూరి హిల్స్ లో రూ. 130 కోట్లతో ఇల్లుకొన్నారని కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఇది పొలిటికల్ గా చర్చనీయాంశం అయింది. నిజంగా పవన్ కాస్ట్లీ ఇంటిని నిర్మించుకొన్నారా.. ? అని అభిమానులు మాట్లాడుకొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పవన్ వర్గం క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేసింది. ఏడాది క్రితం పవన్ ఓ ఇంటిని కావూరి హిల్స్ ప్రాంతంలోని నీరూస్ షోరూమ్ వెనుక కట్టించుకున్న మాట వాస్తవం. పవన్ సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ ఈ విషయంలో పర్యవేక్షణ కూడా చేశారని టాక్.

ఆ ఇల్లు 800 గజాలకు కాస్త అటు ఇటుగా వుంటుందని తెలుస్తోంది. దాదాపు 30 కోట్ల ఖర్చయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే పవన్ కట్టుకున్న ఇల్లు అయితే ఇదే అని, 130 కోట్లు అన్నది గ్యాసిప్ మాత్రమేనని పవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నీరూస్ వెనుక కట్టుకున్న ఇల్లు కూడా మరీ అద్భుతంగా ఏమీకాదని, జస్ట్ మామూలుగానే వుంటుందని తెలుస్తోంది. మరీ.. కత్తి మహేష్ పవన్ ఇంటి రేటు రూ. 130కోట్ల అని ఎందుకు చెప్పినట్టు. పబ్లిసిటీ కోసమా ? పవన్ ఉన్నోడు అని చెప్పేందుకా!?