పవర్ స్టార్ ఓకే, మెగాస్టార్ డౌటు !

మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదిన వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నాడు. మంగళవారం ‘మెగాస్టార్ చిరంజీవి ఆల్ ఇండియా ఫాన్స్’ అధ్యక్షుడు స్వామి నాయుడు పవన్ ను కలిసి ఈ వేడుకలకు ఆహ్వానించారు. పవన్ వస్తానని మాటిచ్చాడు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఆగష్టు 22వ సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ శిల్పాకళా వేదికలో మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలుకానున్నాయి.

ఈ వేడుకులకి మెగా హీరోలందరూ హాజరుకానున్నారు. పవన్ కల్యాణ్ వస్తుండటంతో ఈ కార్యక్రమానికి మరింత కలొచ్చింది. ఐతే, కథనాయకుడు లేని సినిమా అన్నట్టుగా.. ఈ వేడుకులకి మెగాస్టార్ చిరంజీవి రావడం డౌటు అని చెబుతున్నారు. సాధారణంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలకి దూరంగా ఉంటారు. అభిమానులు మాత్రం ఘనంగా జరుపుకొంటారు. అప్పుడప్పుడు మాత్రమే మెగాస్టార్ బర్త్ డే వేడుకలని ఘనంగా జరుపుకొన్న సందర్భాలున్నాయ్. ఐతే, ఈసారి తమ్ముడు పవన్, మెగా ఫ్యామిలీ మొత్తం వస్తుండటంతో.. మెగాస్టార్ కూడా వస్తారని చెబుతున్నారు.