కోడెల ఆయన దూడులని సస్పెండ్ చేయాలి
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అడ్డంగా దొరికిపోయాడు. ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ ని ఆయన తీసుకెళ్లారు. దీనిపై వివాదం చెలరేగే వరకు కోడెల నోరు మెదపలేదు. ఫర్నీచర్ మాయమైందని ప్రభుత్వం కేసు నమోదు చేసేందుకు రెడీ అయిన నేపథ్యంలో కోడెల నోరు తెరిచారు. ఆ ఫర్నీచర్ నా దగ్గరే ఉంది. కావాలంటే దానికి డబ్బులిస్తా. లేదంటే ఫర్నీచర్ తీసుకెళ్లొచ్చని కూల్ చెప్పారు. ఈ నేపథ్యంలో కోడెలపై వైసీపీ నేతలు తగులుకొన్నారు.
స్పీకర్ గా ఉండి ఫర్నీచర్ దొంగలించడానికి సిగ్గులేదు. ఫర్నీచర్ ని కూడా వదలని టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు మింగి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇక, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందుకేసి.. డెల, ఆయన దూడలను టీడీపీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఇప్పటికైనా చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరీ.. నిజంగానే చంద్రబాబు కోడెలని సస్పెండ్ చేస్తారా ? చూడాలి.
అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపిసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశాడు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు గారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 21, 2019