రివ్యూ : కౌసల్య కృష్ణమూర్తి

చిత్రం : కౌసల్య కృష్ణమూర్తి (2019)

నటీనటులు : ఐశ్వర్యా రాజేష్‌, శివ కార్తీకేయన్‌, రాజేంద్ర ప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్,ఝాన్సీ తదితరులు

దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు

సంగీతం : దిబు నైనన్‌ థామస్‌

నిర్మాత : కేఎ వల్లభ

రిలీజ్ డేట్ : ఆగస్ట్23, 2019.

రేటింగ్ : 2.75/5

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళ్ హిట్ ‘కణా’కి రిమేక్ ఇది. తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించారు. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి జాతీయ మహిళా జట్టుకి ఎంపిక అవ్వడం నేపథ్యంలో ఈ సినిమా తెరకెకెక్కింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకొన్న.. కౌసల్య కృష్ణమూర్తి భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఇరగవరానికి చెందిన రైతు కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్‌)కు క్రికెట్ అంటే ఇష్టం. కాదు పిచ్చి. ఒకవైపు తండ్రి చనిపోయి ఉంటే మరోవైపు క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ ఉంటాడు. క్రికెట్ అంటే అంతటి ఇష్టం. ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని తండ్రి కృష్ణమూర్తి కన్నీళ్లు పెట్టుకోవడం కూతురు కౌసల్య(ఐశ్వర్యా రాజేష్‌) చూస్తోంది. అప్పుడే తాను పెద్ద క్రికెటర్ కావాలని, ఇండియా తరుపున ఆడాలని, తండ్రిని సంతోషపెట్టాలని నిర్ణయించుకొంటుంది కౌసల్య. ఆడపిల్ల ఆటలంటూ బయటికిరావడం, సమాజం చిన్న చూపు చూడటం, హేలన.. అయినా కౌసల్య క్రికెటర్ గా ఎలా ఎదిగింది ? అన్నది కౌసల్య కృష్ణమూర్తి మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* ఐశ్వర్యా రాజేష్‌ నటన

* సంగీతం

* సంభాషణలు

* భావోద్వేగాలు

* క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

క్రికెట్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయ్. కౌసల్య కృష్ణమూర్తి క్రెకెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. తమిళ్ హిట్ ‘కణా’కి రిమేక్. మాతృకలోని ఫ్లేవర్ మిస్ ఏమాత్రం మిస్ కాకుండా.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. అవి బాగున్నాయి. ఐతే, ఈ సినిమా మొత్తం క్రెకెట్ నేపథ్యంలోనే సాగలేదు. అది ఒక ట్రాక్ మాత్రమే. మరో ట్రాక్ లో వ్యవసాయం, రైతు కష్టాలని చూపించాడు దర్శకుడు. రైతుగా రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతం. ఆయన భార్యగా ఝానీ నటించింది. రైతు కుటుంబం అయి ఉండి.. కూతురిని క్రెకెటర్ చేసేందుకు పడిన తపన ఆకట్టుకొంది. ఇక, కౌసల్య పాత్రలో ఐశ్వర్యారాజేష్ ఒదిగిపోయింది.

కృష్ణమూరి ఫ్యామిలీ ఎమోషన్స్ లో వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. కౌసల్యను ప్రేమిస్తూ.. ఆమె లక్ష్య సాధనలో సాయపడే సాయికృష్ణ పాత్రలో కార్తీక్‌ రాజు బాగానే నటించాడు. తమిళ్ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రళో ఆకట్టుకొన్నాడు. మిగితా నటీనటులు తమ తమ పరిధిమేరకు నటించారు. ఐతే, సినిమా కథలో కొత్తదనం లేదు. కథనం సాదాసీదా సాగింది. సన్నివేశాలు ప్రేక్షకుడు ముందే ఊహించే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కౌసల్య కృష్ణమూర్తి యావరేజ్ అనిప్ంచుకొంది. కథ-కథనంలో ఇంకాస్త కొత్తదనం కనిపిస్తే.. ఫలితం మరోలా ఉండేది.

సాంకేతికంగా :

క్రీడా నేపథ్యం సినిమాలకి సంగీతం ప్రధానం బలం కావాలి. దిబు నైనన్‌ థామస్‌ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా రైతు గురించి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని చోట్ల సినిమా స్లోగా అనిపించింది. క్లైమాక్స్ ఏపీసోడ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : కౌసల్య + కృష్ణమూర్తిల నటన బాగుంది. రైతు కష్టాలని బాగా చూపించాడు. యూత్, ఫ్యామిలీని ఆకట్టుకొనేలా కౌసల్య కృష్ణమూర్తి ఉంది

రేటింగ్ : 2.75/5