అర్జున్‌ కపూర్‌’తో డేటింగ్ విమర్శలపై మలైకా రియాక్షన్‌


మలైకా అరొరా.. ‘ఛయ్య ఛయ్య..’, ‘అనార్కలీ డిస్కో ఛాలీ..’, ‘మున్నీ బద్నామ్‌ హుయే..’ తదితర పాటలతో గుర్తింపు తెచ్చుకొంది. ఆమె కొన్నేళ్లుగా యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌ ప్రేమలో ఉన్నారు. మలైకా కంటే అర్జున్‌ 11 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.

‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా ఇటీవల అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇతడు నావాడు’ అని పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో వీరి వివాహం జరగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అర్జున్ కపూర్ తో మలైకా డేటింగ్ ని పలువురు తప్పుబడుతున్నారు. దీనిపై మలైకాని ప్రశ్నించగా.. “ప్రజలు ఇతరులు చేసే ప్రతి పనినీ పరిశీలిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ప్రతి సెలబ్రిటీకి ఈ పరిస్థితి వస్తుంది. విమర్శకుల్ని మనం ఆపలేం. అవన్నీ వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు” అని చెప్పుకొచ్చింది.