ప్లాప్ ఇచ్చినా.. రకుల్ వదలడం లేదు !


ప్లాప్ ఇచ్చిన దర్శకుడిని దూరం పెట్టడం ఇండస్ట్రీ చూస్తుంటాం. కానీ, రకుల్ మాత్రం ప్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మథుడు 2. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో బూత్ డైలాగ్స్ ఎక్కువయ్యానే కామెంట్స్ వినిపించాయి.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రకుల్ తదుపరి సినిమా ఉండనుందట. మన్మథుడు 2 కంటే ముందే రాహుల్ చెప్పిన కథ ఇదని తెలుస్తోంది. మరోవైపు, నాని హీరోగా రాహుల్ తదుపరి సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమాలో రకుల్ హీరోయిన్ నా ? లేదంటే రకుల్ కోసం రాహుల్ ఓ లేడీ ఓరియెంటెడ్ కథని రెడీ చేశారా ?? అన్నది తెలియాల్సి ఉంది.