రీ-డిజైనింగ్ పేరుతో దోచుకుంటున్నారు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంటోందని ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో భట్టి విలేకరులతో మాట్లాడారు.
రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ పేరుతో రూ. 40,000 కోట్లకు పెంచారు. అలాగే రూ.1500 కోట్లతో పూర్తయ్యే సీతారామ ప్రాజెక్ట్ రూ. 15 వేల కోట్లు పెంచారని ఆరోపణలు చేశారు.

ఈ అవినీతి వ్యవహారంపై కేంద్ర హోం మంత్రిని కలిసి సీబీఐ విచారణ జరపాలని కోరతామని భట్టి తెలిపారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల బాట పట్టి.. జరుగుతున్న అవినీతి దందా ప్రజలకు వివరిస్తామని భట్టి అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఆరోపణలకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాజెక్ట్ లని త్వరగా పూర్తి చేసే పనిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఒక్కసారి రైతులకి నీళ్లు అందించగలిగితే.. కాంగ్రెస్ నేతల ఆరోపణలకి చేతల ద్వారా సమాధానం ఇచ్చినట్టు అవుతుందని తెరాస ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జెడ్ స్వీడుతో ప్రాజెక్టుల పనులని పూర్తి చేస్తున్నారు.