‘సాహో’లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. ?


‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఇందులో ప్రభాస్‌ రూ.2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ పాత్రలో ఓ పెద్ద ట్విస్ట్‌ ఉండబోతుందంట.

అది ఏమిటంటే.. ? ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పాలి. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. శ్రద్దా కపూర్ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 30న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.