ఫోర్బ్స్‌ 2019 మన ముద్దుగుమ్మలు లేరు


ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ 2019 ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న నటీమణుల జాబితాను విడుదల చేసింది. ఇందులో హాలీవుడ్‌ బ్యూటీ స్కార్లెట్‌ జాన్సన్‌ అగ్ర స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రెండో స్థానంలో సోఫియా వర్గరా నిలిచారు. ఆమె దాదాపు రూ.315 కోట్లు (44.1 మిలియన్‌ డాలర్లు) ఆర్జించింది. రీస్ విథర్‌స్పూన్‌టో మూడో స్థానంలో నిలిచారు.

నికోల్‌ కిడ్మాన్‌, జెన్సీఫర్‌ అనిస్టన్‌ రూ.245 కోట్లు (34 మిలియన్‌ డాలర్లు), రూ.200 కోట్లు (28 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి వరుసగా నాలుగు, ఐదు స్థానాలు సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్‌-2019 జాబితాలో ఒక్క బాలీవుడ్‌ నటి కూడా చోటు దక్కించుకోలేదు.

1 జూన్‌ 2018- 1 జూన్‌ 2019 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించిన నటుల జాబితాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్‌ నుంచి రూ.466 కోట్లతో బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.