గుడ్ న్యూస్ : ‘బాహుబలి 3’ రాబోతుంది


బాహుబలి అభిమానులకి గుడ్ న్యూస్. ‘బాహుబలి 3’ కూడా రాబోతుంది. బాహుబలి2 సమయంలోనే ‘బాహుబలి 3’ ఉంటుందనే సంకేతాలిచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి కథ 60శాతం మాత్రమే చెప్పామని, మిగిలిన 40 కథని బాహుబలి 3 చెప్పొచ్చని అన్నారు. ఐతే, బాహుబలి 3 ఎప్పుడు ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పలేదు జక్కన.

ప్రస్తుతం సాహో సినిమా ప్రమోషన్స్ బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి 3 ఉంటుందని చెప్పాడు. రాజమౌళి రెడీగా ఉన్నారు. తాను ఓకే చెబితే బాహుబలి 3 చేస్తానని చెప్పారని చెప్పారు. తనకి కూడా బాహుబలి 3 చేయాలని ఉందన్నారు డార్లింగ్. కానీ బాహుబలి మూడో పార్ట్ ఎప్పుడు ఉండనుందని ప్రభాస్ కూడా కచ్చితంగా చెప్పలేదు. ఐతే, బాహుబలి 3 చేయాలనే ఆలోచన మాత్రం ఉందని
రాజమౌళి, ప్రభాస్ ఇద్దరికీ ఉందనే విషయం మాత్రం స్పష్టమైంది.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.