‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషనల్ సాంగ్ వచ్చేస్తోంది !


విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మెగాస్టార్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. సెప్టెంబరు 13న నాని గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కోసం స్పెషల్ గా ఓ ప్రమోషనల్ సాంగ్ ని ప్లాన్ చేశారు. ‘ప్రస్తుతం నానిపై ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. మిగితా వివరాలు తర్వాత తెలియజేస్తాం’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తాజాగా ట్విట్ చేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. దానికి మంచి స్పందన వచ్చింది. సాహో సందడి ముగిసిన తర్వాత గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ లో వేగం పెంచనున్నారు.