తొలి టెస్టు : భారీ ఆధిక్యం దిశగా భారత్


తొలి టెస్టులో కోహ్లీసేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ చేసి భారత్‌ 75 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆటముగి
సేసరికి 3వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ(51 బ్యాటింగ్‌), అజింక్య రహానె(53 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 16, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 38 పరుగులు చేశారు. పుజారా 25 పరుగులతో ఆకట్టుకొన్నాడు. ఐతే, చాలా తక్కువ వ్యవథిలో టీమిండియా రాహుల్, పూజారా వికెట్లు కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోరు 81/3. స్వల్ప పరుగుల వ్యవధిలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన భారత్‌ ఇన్నింగ్‌ను కోహ్లీ, రహానె చక్కదిద్దారు. శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు రెండోరోజు 189/8 ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విండీస్ మరో 33 పరుగులు జోడించి 222 పరుగుల వద్ద ఆలౌటైంది.