సంపూ.. ఓ చెత్త హీరో !

తొలి సినిమాకి ముందే బర్నింగ్‌ స్టార్‌ అనే గుర్తింపుని తెచ్చుకున్నాడు సంపూర్ణ్నేష్ బాబు. ‘హృదయకాలేయం’తో కథానాయకుడిగా నవ్వుల్ని పంచిన సంపూ, ఇటీవలే ‘కొబ్బరిమట్ట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంపూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఇంతకీ ‘హృదయకాలం’లో ఎలా అవకాశం వచ్చిందని అడగగా.. ఒక చెత్త హీరో కావాలి, ఎక్కడ దొరుకుతాడా? అని సాయిరాజేష్‌ వెదుకుతున్నారు. అనుకోకుండా ఆయన ప్రసాద్‌ ల్యాబ్‌లో నన్ను చూశారు. విచిత్రమైన స్టైల్‌తో కనిపించిన నన్ను చూసి ఇతనే నేను వెదుకుతున్న హీరో అనుకున్నారట. ఆయనకి నాకూ తెలిసిన మరో స్నేహితుడు నన్ను సాయిరాజేష్‌కి పరిచయం చేశారు. అలా అప్పుడే ‘హృదయకాలేయం’ కోసం నన్ను ఎంపిక చేసుకొన్నారని తెలిపారు.

సినిమాల్లోకి రాకముందు సంపూ బంగారు ఆభరణాలు తయారు చేసేవాడట. ఆయనకి సిద్దిపేటలో వర్క్‌షాప్‌ కూడా ఉందట. ఆభరణాలు తయారు చేయడంలో సంపూకి మంచి నైపుణ్యం ఉందట. ఇప్పటికీ ఆయనకు కస్టమర్లు ఉన్నారట. ఇక కొబ్బరిమట్ట దర్శకుడితో సంపూ తదుపరి సినిమా ఉండనుంది.