బిగ్ బాస్ 3 : ఈ వారం అషూరెడ్డి అవుట్

మరోసారి లీకులు నిజమయ్యాయి. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ నుంచి అషూరెడ్డి ఎలిమినేట్ కానుందని రెండ్రోజుల ముందే న్యూస్ లీకైంది. అదే నిజమైంది. ఐదోవారం బిగ్ బాస్ హౌస్‌ నుంచి అషూరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. గతవారం జరిగిన నామినేషన్స్‌లో మహేశ్‌ విట్టా, శివజ్యోతి, అషూరెడ్డి, బాబా భాస్కర్‌, హిమజ, పునర్నవి భూపాలం, రాహుల్‌ సిప్లిగంజ్‌లు ఎలిమినేషన్ కి ఎంపికయ్యారు

వీరిలో అషూరెడ్డికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్‌ నుంచి తొలివారం హేమ, రెండోవారం జాఫర్, మూడో వారం తమన్నా, నాల్గోవారం రోహిణి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్‌ లోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని తెలుసోంది. ఈసారి హాట్ హీరోయిన్ ని హౌస్‌ లోకి పంపనున్నట్టు తెలుస్తోంది. హెబ్బాపటేల్ పేరు గట్టిగా వినిపిస్తోంది.