‘సాహో’ రూ. 150కోట్లు కథ
బాహుబలి తర్వాత ప్రభాస్ నచ్చిన కథ ‘సాహో’. అభిమానుల కోసం ఇలాంటి కథనే చేయాలని డిసైడ్ అయ్యాడు. కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన సుజీత్ ని నమ్మాడు. ఐతే, సాహోని ముందుగా రూ. 150కోట్ల బడ్జెట్ తో మాత్రమే ప్లాన్ చేశారట. ఐతే, బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యంతో సాహో బడ్జెట్ నిపెంచుకుంటూ వెళ్లారు. అది రూ. 350కోట్లకి చేరింది.
ఆ మొత్తాన్ని రాబట్టే సత్తా సాహోకు ఉంది. ‘సాహో’ పక్కాగా ఓ కమర్షియల్ సినిమా. లార్జర్ దేన్ లైఫ్‌లా ఉంటుంది. ‘బాహుబలి’ తరవాత ఏం చేసినా కొత్తగానే ఉండాలి.అందుకే సాహో సినిమా చేశానన్నారు ప్రభాస్. సాహో’లో కొన్ని సన్నివేశాలు చాలా కీలకం. ఒక్కో సన్నివేశం మళ్లీ మళ్లీ తెరపై కనిపిస్తుంటుంది. అందులోనే రకరకాల షేడ్స్ కనిపిస్తాయి. వాటిని తెరకెక్కించడం చాలా కష్టం. వాటిని సుజిత్ సమర్థంగా తెరకెక్కించాడని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. ఓ ప్రత్యేక గీతంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మెరిసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.