కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకొంది.
* దేశంలో కొత్తగా 75 వైద్య కళాశాలలు ఏర్పాటు
* వీటి నిర్మాణాన్ని 2021-2022 సంవత్సరానికల్లా పూర్తి చేయాలని టార్గెట్
* ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 15,700 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి
* చెరకు రైతులకు రూ.6వేల కోట్ల ఎగుమతి రాయితీలు
* ఆ రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
* పంచదార ఎగుమతి విధానానికి ఆమోదం
* మిగులు పంచదారను 2019-20 సీజన్‌లోగా ఎగుమతి చేయాలని నిర్ణయం
* ఈ సంవత్సరంలో 60లక్షల టన్నుల పంచదారను ఎగుమతి చేస్తాం
* బొగ్గు గనుల్లో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి