భారత యువతి ప్రేమలో మ్యాక్స్‌వెల్‌


ఆసీస్‌ పేసర్‌ షాన్‌ టైట్‌ భారత యువతిని పెళ్లాడాడు. ఐపీఎల్‌ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్‌ సింఘా ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ భారత యువతితో ప్రేమలో పడ్డాడని సమాచారమ్. ఆమెతో చాలాకాలంగా చెట్టాపట్టాల్‌ వేసుకుంటూ ఆసీస్‌ వీధుల్లో తిరిగేస్తున్నాడు. ఆ అమ్మాయి పేరు విని రామన్‌. ఆస్ట్రేలియా స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాక్స్‌వెల్‌ మెరుపులను అభిమానులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తారు. కాగా ఈ మధ్యే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో లాంక్‌షైర్‌ తరఫున వీరవిహారం చేస్తున్నాడు. బహుశా.. ప్రేమలో పడినకిక్కుని అక్కడ పనిచేస్తున్నట్టుంది.

View this post on Instagram

Moments like these making the moments apart easier 💕

A post shared by VINI (@vini.raman) on