ఐసీసీకి సచిన్ స్ట్రోక్స్
ఐసీసీ అతిపై సచిన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అద్భుత పోరాటంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఐసీసీ కూడా ట్విటర్లో
బెన్‌స్టోక్స్ ని కీర్తించింది. అనడం కంటే కాస్త అతి చేసిందని చెప్పాలి.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో విజయానికి 73 పరుగులు అవసరమైన సమయంలో బెన్‌స్టోక్స్ వీరవిహారం చేశాడు. ఒక్క వికెట్ ఉన్నప్పటికీ చివరివాడైన జాక్‌లీచ్ సహకారంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. జట్టుకు తిరుగులేని విజయం అందించాడు.
దీంతో ‘చెప్పాం కదా. ఎప్పటికీ అత్యుత్తమ ఆటగాడు (గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైం) – అతడితో సచిన్’ అని ట్వీట్ చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన స్టోక్స్‌కు సచిన్ పురస్కారం అందజేస్తున్న చిత్రం ఉంచింది.
ఐతే, ఐసీసీ అతిపై సచిన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎప్పటికీ సచినే అత్యుత్తమం. అతడి తర్వాతే ఎవరైనా. అర్థమైందా?, ‘ఒకరేమో టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులు సాధించారు. సగటు 54, 45. ఇంకొకరేమో టెస్టుల్లో 3,479, వన్డేల్లో 2,628 చేశారు. సగటు 35, 40. ఇంకా సెంచరీల గురించి చెప్పమంటారా?’ అంటూ ఐసీసీని కామెంట్స్ తో కొడుతున్నారు.