‘సాహో’పై పవన్ ఫ్యాన్స్ నెగటివ్ ప్రచారం !

ప్రభాస్ ‘సాహో’ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్సిడ్ టాక్ తెచ్చుకొంది. సాహోలో యాక్షన్ అదిరిపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉంది. కానీ ఎమోషన్ మిస్సయింది. వినోదం పండలేదు. అదే సినిమాకు పెద్ద మైనస్ గా చెబుతున్నారు. యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, బ్యాడ్ బోయ్ సాంగ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక అసలే మిక్సిడ్ టాక్ తెచ్చుకొన్న సాహోపై పవన్ ఫ్యాన్స్ పనిగట్టుకొని నెగటివ్ ప్రచారం చేస్తున్నారని వివాదాస్పద నటి శ్రీరెడ్ది ఆరోపించారు. ‘సాహో’ సినిమా ఎలా ఉందని.. ? సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన శ్రీరెడ్డి.. ‘సాహో సినిమా ఫ్లాప్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు ఎవరో తనకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనిగట్టుకొని మరీ సినిమాపై ఫ్లాప్ కామెంట్స్ చేస్తున్నారు’ అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిని తగులుకొన్నారు. దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు.